(Local) Sun, 20 Oct, 2019

తమిళనాడులో మహిళా ఐపీఎస్ పై లైంగిక వేధింపులు

August 29, 2019,   12:37 PM IST
Share on:
తమిళనాడులో మహిళా ఐపీఎస్ పై లైంగిక వేధింపులు

తమిళనాడులో 2018లో మహిళా ఐపీఎస్ ను వేధించారని ఐజీ స్థాయి అధికారి  మురుగన్ అనే అధికారి పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో ఒత్తిళ్లు వస్తున్న కారణంగా కేసును మరో స్టేట్ కు బదిలీ చేయాలని బాధితురాలు కోర్టుకు రిక్వెస్ట్ చేసింది. దీంతో ఈ కేసును కోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. 6 నెలల్లో విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీకి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసుకు సంబంధించి అన్ని ఫైల్స్ ను తెలంగాణ సీఎస్ కు అందజేయాలని తమిళనాడు డీజీపీని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. 2018 ఆగష్టు21న కేసు నమోదైంది. మురుగన్ పై పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.  ఈ కేసుపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు మధ్యంతర కమిటీని నియమించింది. ఆ కమిటీకి మహిళా ఎస్పీ తన ఆవేదనను తెలిపింది. ఉన్నతాధికారి తనను ఎలా వేధిస్తున్నాడో అన్న వాటిని గ్రాఫిక్స్ ద్వారా కమిటీకి వివరించింది. చాలాసార్లు ఐజీ తనను కౌగిలించుకున్నాడని తాను వ్యతిరేకించడంతో వేధించడం మెుదలుపెట్టినట్లు ఆమె కమిటీ ఎదుట వాపోయింది. తమిళనాడులో కేసు విచారణ అయితే రాజకీయ ఒత్తిళ్ల ద్వారా సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందని మహిళా ఐపీఎస్ మద్రాస్ హైకోర్టుకు విన్నవించింది. కేసును వేరే రాష్ట్ర కోర్టుకు బదిలీ చేయాలని కోరడంతో స్పందించిన కోర్టు తెలంగాణ హైకోర్టుకు కేసును బదిలీ చేసింది.

సంబంధిత వర్గం
చిన్మయానంద్‌కు బెయిల్ తిరస్కరణ
చిన్మయానంద్‌కు బెయిల్ తిరస్కరణ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.