(Local) Mon, 17 Jun, 2019

కేరళలో నర్స్ ని హత్తుకున్న రాహుల్ గాంధీ

June 10, 2019,   1:49 PM IST
Share on:

49 ఏళ్ళ క్రితం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసి కేరళకు చెందిన రాజమ్మ వావతిల్‌ (72) ఇంటికి రాహుల్ గాంధీ  వెళ్లారు. రాజమ్మ వావతిల్ ఢిల్లీలో నర్సుగా పనిచేస్తున్న ఆస్పత్రిలోనే రాహుల్‌ గాంధీ పుట్టారు. అప్పుడే పుట్టిన రాహుల్‌ను రాజమ్మ వావతిల్ తొలిసారి తన చేతుల్లోకి ఎత్తుకుంది. కేరళ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ ఆదివారం రాజమ్మ ఇంటికి వెళ్లి, ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు. తన చేతుల్లో తొలిసారి ఒదిగిన ఆ చిన్నారి రాహుల్ ఇంత ఎత్తు ఎదిగి తమ లోక్‌సభా స్థానానికి ప్రజాప్రతినిధిగా రావడంతో రాజమ్మ వావతిల్ మురిసిపోయింది.

రాహుల్‌ గాంధీ తిరిగి వెళ్లేటపుడు ఆమె పనస చిప్స్‌, కొన్ని మిఠాయిలను ఆయనకు ఇచ్చింది. రాహుల్‌ పుట్టే సమయానికి ఆయన తండ్రి రాజీవ్‌, బాబాయ్‌ సంజయ్‌ గాంధీ బయట వేచి ఉన్నారని రాజమ్మ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి వివాదం చెలరేగిన నేపథ్యంలో రాజమ్మ వావతిల్ ఇంటికి ఆయన వెళ్ళడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.