(Local) Mon, 23 Sep, 2019

గురువాయుర్‌ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తులాభారం

June 08, 2019,   12:29 PM IST
Views: 161
Share on:
గురువాయుర్‌ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తులాభా ...

కేరళలోని ప్రముఖ గురువాయుర్‌ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సందర్శించారు.కేరళ సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోచీ నుంచి నేవీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని బయల్దేరి ఆలయానికి చేరుకున్నారు.ప్రధాని వెంట ఆ రాష్ట్ర గవర్నర్‌ పి.సాదాశివం, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీ.మురళీధరన్‌, కేరళ దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్‌ ఉన్నారు.ఆలయంలో ప్రధాని తులాభారం నిర్వహించారు.మోదీ తన బరువుకు సమానంగా 100 కిలోల కమల పువ్వులతో తులాభారం వేసి ఆలయానికి సమర్పించారు.అదేవిధంగా నెయ్యి, ఎర్రటి అరటిపండ్లను ఆలయానికి సమర్పించారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.