(Local) Mon, 27 Sep, 2021

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

November 28, 2019,   3:36 PM IST
Share on:
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతానికి మా వద్ద ఏదీ లేదు.’ అని ఆ సమాధానంలో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్‌, ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఉద్యోగులను ముందుగానే రిటైర్ చేయించే అధికారం ఉంది. ఆ అధికారి సమర్థవంతంగా పనిచేయకపోయినా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.