(Local) Mon, 23 Sep, 2019

వారణాసిలో భారీ విధ్వంసానికి స్కెచ్ వేస్తున్న లష్కరే తాయిబా

August 28, 2019,   2:22 PM IST
Views: 104
Share on:
వారణాసిలో భారీ విధ్వంసానికి స్కెచ్ వేస్తున్న లష్కర ...

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లో దాడులకు కొత్త వ్యూహాలకు పధకాలు రచిస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ఇంటెలిజెన్స్ విభాగం అందించిన నివేదిక ప్రకారం ఉగ్రమూకలు భారత్ లోని వివిధ ప్రాంతాల్లో కొత్త టార్గెట్లను ఎంపిక చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తాయిబా స్కెచ్ వేసినట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది. వారణాసిలో భారీ టెర్రర్ అటాక్ కు లష్కర్ ప్రణాళికలను రచిస్తోందని, ఇందులో భాగంగా అక్కడ ఓ బేస్ ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోందని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇందులో భాగంగా అక్కడ ఓ బేస్ ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోందని ఇంటెలిజెన్స్ తెలిపింది. మరోవైపు, కొన్ని నెలల క్రితమే లష్కరే తాయిబా ఉగ్రవాదులు వారణాసిలో పర్యటించారని, బేస్ ఏర్పాటు కోసం కొన్ని ప్రాంతాలను కూడా పరిశీలించారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు పవిత్ర కాశీ నగరంలో విధ్వంసం సృష్టించడంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 
 

సంబంధిత వర్గం
నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకనున్న ఐఎంఏజీహెచ్‌
నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకనున్న ఐఎంఏజీహెచ్‌
మోదీ కోసం ముస్లిం మహిళల ప్రత్యేక రాఖీలు..
మోదీ కోసం ముస్లిం మహిళల ప్రత్యేక రాఖీలు..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.