(Local) Mon, 20 Sep, 2021

తానెంత కాలం బతికేది చెప్పేసిన దలైలామా

August 29, 2019,   11:33 AM IST
Share on:
తానెంత కాలం బతికేది చెప్పేసిన దలైలామా

బౌద్ధ మత గురువు దలైలామా  ఆసక్తికర ప్రకటన చేశారు.  ప్రస్తుతం 84 ఏళ్ల వయసులో ఉన్న ఆయన కొద్దిరోజులుగా అస్వస్థతో ఉన్నారు. వైద్య సాయంతో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అయితే.. దలైలామా ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలో ఉన్న భక్తులకు సాంత్వన కలిగేలా ఆయన వీడియోను విడుదల చేశారు. సదరు  వీడియోలో తన తాజా ఆరోగ్య పరిస్థితి  గురించి వివరించిన దలైలామా.. తాను 110 ఏళ్ళు  బతుకుతానని చెప్పారు. కాలజ్ఞానం ఆధారంగా తానీ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. దలైలామా ప్రకటనతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు .ఏడాది కాలంగా దలైలామా  ఛాతీలో ఇన్ ఫెక్షన్ కారణంగా చికిత్స  పొందుతున్నారు. తనకొచ్చిన కలలో ధర్మరక్షకులైన దేవతల్లో ఒకరైన పాల్ డెస్ లామో కనిపించారని.. తాను 110 ఏళ్ళ జీవిస్తానని చెప్పారన్నారు. అదే సమయంలో భవిష్యత్తులో జరిగే పరిణామాల పైనా  దలైలామా వెల్లడించారు. తనకు చికిత్స చేసిన భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యం గురించి వచ్చే అపొహల్ని నమ్మొద్దన్నారు. మొత్తంగా తనను ఆరాధించే వారందరికి ఆందోళన తగ్గించి.. ఆనంద పడేలా  దలైలామా ప్రకటన చేశారని చెప్పాలి.   


 

సంబంధిత వర్గం
పాక్ ప్రధాని తన వైఖారిని మార్చుకోవాలి: దలైలామా
పాక్ ప్రధాని తన వైఖారిని మార్చుకోవాలి: దలైలామా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.