(Local) Wed, 21 Aug, 2019

రాయ్‌పూర్‌లో 15 కిలోమీటర్ల జాతీయ జెండా

August 12, 2019,   1:20 PM IST
Share on:

మరో మూడు రోజుల్లో భారత స్వాతంత్ర దినోత్సవం రానుంది . దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో పలు స్వచ్ఛంద సంస్థలు 15 కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నాయి. ఆగష్టు 15ను పురస్కరించుకుని వసుధైవ్‌ కుటుంబం అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొత్తంగా 35 స్వచ్ఛంద సంస్థలు కలిసి 15 కిలోమీటర్ల జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసాయి. ఆ జెండాను అమపార చౌక్‌ నుంచి పండిట్‌ రవిశంకర్‌ శుక్లా యూనివర్సిటీ వరకు ప్రదర్శించారు. ఈ జాతీయ పతాక ప్రదర్శన.. ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సంపాదించింది. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరులైన జవాన్ల కుటుంబాలను సత్కరించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.