(Local) Wed, 24 Jul, 2019

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ బోనాల పండుగ

July 04, 2019,   1:43 PM IST
Share on:

దేశ రాజధానిలో తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయ కమిటీ ఉమ్మడిగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి.బోనాల ఉత్సవాల్లో ఎంపీలు నామా, రాములు, బండ ప్రకాశ్, లింగయ్య యాదవ్, ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్, తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు.ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఊరేగింపుగా అమ్మవారి యాత్ర సాగింది. తర్వాత తెలంగాణ భవన్ లో ఘట స్థాపన జరిగింది.

ఊరేగింపులో జోగిని రాకేష్ బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారుల డప్పు చప్పులు, ఒగ్గు నృత్యాల మధ్య బోనాల ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది.అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలతో పాటూ, దేశ ప్రజలకు దక్కాలని ఎంపీలు అన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యలతో, మరింత కాలం సీఎంగా రాష్ట్రానికి సేవ చేయాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నామన్నారు.అన్ని మతాలను, పండుగలను గౌరవించే సంస్కృతి తెలంగాణ ప్రజలదని చెప్పారు ఎంపీలు.

ప్రభుత్వ సహకారంతో నే దేశ రాజధానిలో ఐదేళ్లుగా ఇంత ఘనంగా బోనాల పండుగ నిర్వహించగలుగుతున్నామని ఆలయ కమిటీ అధికారులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే ఢిల్లీలో అమ్మ వారికి బంగారు బోనం ఎత్తుతామని మొక్కుకున్నామని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.