(Local) Wed, 21 Aug, 2019

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మోడీ,వెంకయ్య నాయుడు

August 12, 2019,   12:30 PM IST
Share on:

బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశంలోని ముస్లిం సోదరులకుప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ.. "ఈద్ అల్ అద్హా పర్వదినం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పర్వదినం మన సమాజానికి శాంతిని, మరింత ఆనందాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను" అని ట్వీట్‌ చేశారు.ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ట్వీట్‌ చేశారు. "ఈ పర్వదినం భక్తికి, విశ్వాసానికి, త్యాగానికి సంకేతం. సోదరభావం, కరుణ, ఐక్యతకు ఈద్ అల్ అద్హా పర్వదినం ఆదర్శంగా నిలుస్తుందని వెంకయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు."

సంబంధిత వర్గం

ఆరెస్సెస్ విధాలను మోడి అనుసరించడం లేదు - ప్రియాంక

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.