(Local) Sun, 20 Oct, 2019

భద్రత కోసం ముందడుగు వెయ్యాలి - అమిత్ షా

August 29, 2019,   12:53 PM IST
Share on:
భద్రత కోసం ముందడుగు వెయ్యాలి - అమిత్ షా

దేశ భద్రత విషయంలో  ఇంకా శ్రమించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన బీపీఆర్డీ (బ్యూరో పోలీస్ రిసెర్చ్ డెవలప్ మెంట్)  49వ వార్షికోత్సవంలో మాట్లాడారు. దేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ శ్రమిస్తున్నారని అన్నారు. ఆ కల సాకారం కావాలంటే అంతర్గతంగా, బయట పకడ్బందీగా భద్రత పెంచాలన్నారు. పోలీస్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు కొత్త సంస్కరణలు తీసుకు రావల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇది శ్రమతో కూడుకున్నదని, దీనికి బీపీఆర్డీ సహకరించాల్సిన అవసరం ఉందని అమిత్ షా అన్నారు.

సంబంధిత వర్గం
త్వరలో దేశమంతా ఎన్‌ఆర్‌సీ! అమిత్ షా
త్వరలో దేశమంతా ఎన్‌ఆర్‌సీ! అమిత్ షా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.