(Local) Sat, 24 Jul, 2021

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సభాపతి పోచారం

October 06, 2019,   12:15 PM IST
Share on:
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సభాపతి పోచారం

కామారెడ్డి జిల్లా ప్రజలకు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని వారు కోరారు. పూలతో ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉండడం మనందరికీ గర్వకారణం అన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. పేద మహిళలు కూడా ఆనందంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికి చీరలను ఉచితంగా పంపిణీ చేసి వారి కళ్ళలో ఆనందాన్ని నింపుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near '>
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.