(Local) Wed, 24 Jul, 2019

రాయుడి రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్‌ స్పందన

July 04, 2019,   2:17 PM IST
Share on:

 తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ‘రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.. రాయుడు నువ్వు ఉన్నతమైన వ్యక్తివి’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశాడు.

కాగా ప్రపంచకప్‌ జట్టు ఎంపికలో మొదటి నుంచీ స్థానం ఆశించిన రాయుడుని కాదని జట్టు యాజమాన్యం విజయ్‌శంకర్‌ని ఎంపిక చేసింది. చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కె ప్రసాద్‌ అందుకు వివరణ ఇచ్చిన తర్వాత రాయుడిని రెండో స్టాండ్‌బై ఆటగాడిగా ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో తొలుత శిఖర్‌ ధావన్‌ గాయం నుంచి తప్పుకోగా అతడికి బదులు రిషభ్‌పంత్‌ను ఎంపిక చేశారు. అనంతరం విజయ్‌శంకర్‌ సైతం గాయపడడంతో మయాంక్‌ అగర్వాల్‌ని ఎంపిక చేశారు. దీంతో రాయుడు తీవ్ర మనస్తాపానికి గురై రిటైర్మెంట్‌ ప్రకటించాడని తెలుస్తోంది. అయితే సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయకపోవడం వెనుక రాయుడు చేసిన ట్వీటే కారణమని అంతా భావిస్తున్నారు. తొలిసారి ప్రపంచకప్‌ జట్టుని ఎంపిక చేసినప్పుడు తనని కాదని విజయ్‌శంకర్‌ని ఎంపిక చేయడం పట్ల తెలుగు క్రికెటర్‌ చేసిన వివాదాస్పద ట్వీట్‌ తెలిసిందే.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.