(Local) Mon, 18 Nov, 2019

మెగాస్టార్ ను కలిసిన ఉయ్యాలవాడ ఫ్యామిలీ…!!

August 29, 2019,   1:13 PM IST
Share on:
మెగాస్టార్ ను కలిసిన ఉయ్యాలవాడ ఫ్యామిలీ…!!

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కించిన  చిత్రం ''సైరా నరసింహ రెడ్డి''. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన స్వగృహంలో కలిసి ఆనందంగా ముచ్చటించడం జరిగింది. సైరా చిత్రం ద్వారా నరసింహారెడ్డి గారి కుటుంబసభ్యులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మెగాస్టార్ అన్నారు. ఇక వారితో కలిసి మెగాస్టార్ దిగిన ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ అయి, విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సైరాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…!!
 

సంబంధిత వర్గం
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.