(Local) Mon, 17 Jun, 2019

ట్రోల్స్ కి ఘాటుగా సమాధానం ఇస్తున్న సమీరా రెడ్డి

June 10, 2019,   3:26 PM IST
Share on:

సమీరా రెడ్డి ఈ పేరుకు పరిచయం అవసరం లేదు గతంలో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సూర్య లాంటి అగ్ర హీరోలతో నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సమీరా. అయితే పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా కుటుంబమే లోకంగా బ్రతుకుతున్న సమీరా రెడ్డి..  ఈ మధ్యకాలంలో తన ప్రెగ్నేన్సీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలిచింది. చాలా మంది హీరోయిన్లు తము ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల ట్రోలింగ్ కి బలయ్యారు. సదరు ఫొటో పెట్టిన అమ్మడిని ఏకిపారేస్తూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. నిండు గర్భిణిగా ఉన్న ఆమె నేటితరం సోషల్ మీడియా జోరు చూసి తన బేబీ బంప్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టేసింది. ఇవి చూసిన నెటిజన్స్ ఆమెపై విరుచుకు పడ్డారు. నిండు గర్బిణివై ఉండి ఈ ఫోటోలేంటి? అని తెగ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో మరో బేబీ బంప్ ఫోటోని షేర్ చేసింది. బికినీ వేసుకొని తన బేబీ బంప్ కనిపించేలా బీచ్ ఒడ్డున ఫోటోలు దిగింది.  ''పుట్టేందుకు సిద్ధంగా ఉన్న నా బిడ్డ ఆత్మ ఎంతో బాధపడింది. నా కడుపులో స్విమ్ చేస్తోన్న బిడ్డ ఆత్మను గాయపరిచారు. నా ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్ చేయడాన్ని ఎవరైతే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో.. వారందరికీ ఇదే నా సమాధానం'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.