(Local) Sat, 24 Jul, 2021

ఆ బ్యాంకు ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితి రోజుకు వెయ్యి మాత్రమే..!

September 24, 2019,   3:25 PM IST
Share on:
ఆ బ్యాంకు ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితి రోజుకు వెయ్య ...

మహారాష్ట్రలోని పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు ఖాతాదారులు ఏటీఎంల్లో రోజుకు వెయ్యి రూపాయలకు మించి నగదును పొందలేరు. రోజుకు వెయ్యి రూపాయలకు నగదు పరిమితిని కుదిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. సేవింగ్స్, కరెంట్ ఖాతాలతో పాటు ఇతర ఖాతాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ నిబంధన మంగళవారం నుంచే అమలుకానుంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన అమలులో ఉండనుంది. పీఎంసీ బ్యాంకుకు ఇక నుంచి కొత్తగా ఎలాంటి రుణాలను గానీ, గ్రాంట్లను గానీ అందించేది లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే.. పీఎంసీ బ్యాంకు లైసెన్స్‌‌ను మాత్రం ఆర్బీఐ రద్దు చేయకపోవడం గమనార్హం.

సంబంధిత వర్గం
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.