(Local) Sat, 11 Jul, 2020

కుల వివాదంలో కురుపాం వైసీపీ ఎమ్మెల్యే

June 10, 2019,   2:27 PM IST
Share on:
కుల వివాదంలో కురుపాం వైసీపీ ఎమ్మెల్యే

కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖను కేటాయించడంపై గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్సయ్య  అభ్యంతరం వ్యక్తం చేశారు. పుష్పశ్రీవాణి కులానికి సంబంధించి వివాదం కోర్టు విచారణలో ఉండగా.. గిరిజన సంక్షేమ శాఖను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. విశాఖ జిల్లా అరకులోయలో ఆయన మాట్లాడుతూ.. పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని, ఈ అంశంలోనే గతంలో ఆమె సోదరి రామతులసి ప్రభుత్వ ఉద్యోగం కూడా కోల్పోయారన్న విషయాన్ని గుర్తు చేశారు. రామతులసి ఎస్టీ కానప్పుడు ఆమె సోదరి పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతారన్నారు. ఆమె మొదటిసారి గెలిచినప్పుడే కోర్టుకు వెళ్లగా, ఆ కేసు ఇంకా విచారణలో ఉందన్నారు

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.