(Local) Wed, 24 Jul, 2019

రూ. 200 కోట్లను వసూలు చేసిన “కబీర్ సింగ్”

July 04, 2019,   5:20 PM IST
Share on:

తెలుగులో హిట్ సాధించిన “అర్జున్ రెడ్డి” సినిమాను సందీప్ రెడ్డి వంగా హిందీలో “కబీర్ సింగ్”  గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎలా సూపర్ డూపర్ హిట్ అయిందో అలాగే ఈ చిత్రం బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చూపెడుతూ ముందుకు వెళ్తోంది. షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాపై బాలీవుడ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా… అమెరికాలో ఈ సినిమాకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రెండో వారం నుంచి (జూన్‌ 28న) 45 సెంటర్లను పొడిగించారు. ప్రస్తుతం “కబీర్ సింగ్” చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొత్తానికి 13 రోజుల్లోనే 200 కోట్లను వసూలు చేసింది. అయితే సల్మాన్ భారత్ సినిమాకు మాత్రం అందుకు 14రోజుల సమయం పట్టడం గమనార్హం. 5 రోజుల్లో 100కోట్లను కొల్లగొట్టిన కబీర్ సింగ్ ఆ తరువాత మరో 9 రోజుల్లో వంద కోట్లను కొల్లగొట్టేశాడు. షాహిద్ కపూర్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్. ఈ సక్సెస్ తో హీరో షాహిద్ కపూర్, హీరోయిన్ కైరా అద్వానీ రెమ్యునరేషన్స్ పెంచారని, దర్శకుడు సందీప్ వంగాకు సైతం బాలీవుడ్ బడా ప్రొడక్షన్స్ నుంచి అవకాశాలు వస్తున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.