(Local) Sat, 19 Sep, 2020

మారుతీ లో కొలువుల కోత

August 03, 2019,   1:22 PM IST
Share on:
మారుతీ లో కొలువుల కోత

మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు తగ్గిపోవడంతో ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని వాహన తయారీ దిగ్గజం మారుతీ నిర్ణయం తీసుకొంది. దేశంలో సగానికి పైగా ఆటోమొబైల్‌ పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోవడంతో కొలువుల కోత తప్పలేదు. ఈ కోత విషయాన్ని మారుతీ ఒక ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించింది. జూన్‌ 30 నాటికి కంపెనీ 18,845 మందిని నియమించుకోగా.. వీరిలో 6 శాతం 1,181 మందిని తగ్గించుకొంది. ఏప్రిల్‌ నుంచి ఉద్యోగాల కోతను వేగవంతం చేసినట్లు పేర్కొంది. దీంతోపాటు కొత్త ఉద్యోగులను తీసుకోవడాన్ని కూడా నిలిపివేసింది. తాము పర్మినెంట్‌ ఉద్యోగులను తగ్గించుకోలేదని మారుతీ వెల్లడించింది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.