(Local) Mon, 26 Aug, 2019

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు తీర్పు

August 13, 2019,   12:55 PM IST
Share on:

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నేడు స్పష్టత రానుంది. ఈ ఎన్నికలపై మంగళవారం హైకోర్టు తన తీర్పును వెలువడించనుంది. కోర్టు తీర్పు ఆదారంగానే ఎన్నికలను ఎప్పుడు జరపాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుం ది. దీంతో మున్సిపల్ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్న అంశంపై ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా అభ్యంతరా లు వ్యక్తమైన మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలను నిర్వహించడానికి సిద్దంగా ఉన్నట్లు నాలు గు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కోర్టు కు  కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై హైకోర్టు సంతృప్తి చెందుతుందా? లేదా అభ్యంతరాలు ఉన్న మున్సిపాలిటీలను మినహాయించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తుందా? అన్న అంశంపై కొనసాగుతున్న సస్పెన్స్ కూడా వీడనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మొద టి నుంచి భావిస్తున్నట్లుగా పాలకమండలి గడు వు తీరిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త మున్సిపాలిటీలకు కలిసి ఎన్నికలను నిర్వహిస్తుందా? అన్న అంశంపై కూడా స్పష్టత రానుంది.

సంబంధిత వర్గం

ఆరోగ్యశ్రీ పథకం బేష్ ..
సభ్యత్వ నమోదును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టండి ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.