(Local) Mon, 26 Aug, 2019

సమగ్ర ఆరోగ్య సూచిక ...చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది

August 13, 2019,   12:20 PM IST
Share on:

చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు... చింతమడక గ్రామంలో నిర్వహించిన సమగ్ర ఆరోగ్య సూచిక తయారీ ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని హరీశ్‌రావు అన్నారు.

సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం చింతమడక గ్రామంలో కార్పొరేట్ వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు దేశంలోనే మొదటి ఆరోగ్య సూచిక తయారు చేస్తున్న గ్రామంగా చింతమడక ను నిలిపారన్నారు. ఆరోగ్య తెలంగాణకు అడుగులు చింతమడక నుండే పడడం ఆనందంగా ఉందన్నారు. ఇదొక చారిత్రక సం ఘటన అని అన్నారు. గ్రామంలోని ప్రజలకు అన్ని రకాల మౌలిక పరీక్షలు చేసి ఆరోగ్య సూచిక తయారుచేసిన మొదటి గ్రామంగా  చింతమడక చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు.

సంబంధిత వర్గం

కోమటిచెరువులో చేప పిల్లలని వదిలేసిన హరీష్ రావు
కేసీఆర్ తెలంగాణని ఆరోగ్య తెలంగాణగా మారుస్తారు- హరీ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.