(Local) Sat, 06 Jun, 2020

సొంత పార్టీ సీనియర్లపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్

August 13, 2019,   3:00 PM IST
Share on:
సొంత పార్టీ సీనియర్లపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్

టిడిఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తానని టిడిపి ఎమ్మెల్యె గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని తమ అధినేత చంద్రబాబును కోరుతానని చెప్పారు. కాగా పార్టీ సీనియర్లపై ఆయన మండిపడ్డారు. పార్టీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు, ఆరు సార్లు ఓడిపోయిన వారికి కూడా పార్టీలో అంత ప్రాధాన్యతను ఎందుకిస్తున్నారని సొంత పార్టీపైనే అసహనం వ్యక్తం చేశారు. సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశాలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.