(Local) Mon, 23 Sep, 2019

పెరిగిన బంగారం ధరలు

August 17, 2019,   3:57 PM IST
Views: 121
Share on:
పెరిగిన బంగారం ధరలు

పసిడి ధరలు మరోసారి పరుగుపెట్టాయి. ఏకంగా రూ. 2400 పెరుగుదలను నమోదు చేసుకుంది. జువెల్లర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ ఉండటంతో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 39,400 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 36,120గా కొనసాగుతోంది. బంగారం ధరలు హెచ్చు తగ్గులు ఉండటంతో వినియోగదారులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. బంగారానికి అంతర్జాతీయంగా బలహీనమైన ట్రేడ్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పసిడి ధరలు ఈ ఏడాది సుమారు 17 శాతం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 47,850 పలుకుతోంది. 

సంబంధిత వర్గం
తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
పరుగులు పెడుతున్న బంగారం
పరుగులు పెడుతున్న బంగారం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.