(Local) Wed, 24 Jul, 2019

చైతు కి కట్నం ఇచ్చాను - సమంత

July 04, 2019,   3:58 PM IST
Share on:

ఏదైనా సినిమా రిలీజ్ కావొస్తోంది అంటే ఆ సినిమా ప్రమేషన్స్ డిఫరెంట్ గా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అదే కోవలో 'ఓ బేబీ' చిత్ర యూనిట్ కూడా విభిన్నంగా చేయాలని నిర్ణయించుకుని దానికోసం సోషల్‌ మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వతో కలిసి నందినీరెడ్డి, సమంత ఓ ప్రముఖ ఛానెల్‌ నిర్వహించిన ఫన్నీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గంగవ్వ.. సమంతను, నందినీ రెడ్డిని తన ఫన్నీ ప్రశ్నలతో తికమక పెట్టి నవ్వించింది.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా గంగవ్వ సమంతను మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటార లేక మీరు చూసుకుంటార అనే ప్రశ్నకు సమంత ఒకర్నొకరం బాగా చూసుకుంటాం అని బదులిచ్చింది. అంతేకాక గంగవ్వ చైతు కి ఎంత కట్నం ఇచ్చావా అని అడిగితె సామ్ నవ్వుతు చాల ఇచ్చాను, ఎంత ఇచ్చానో నీ చెవిలో చెప్తాను అని ఫన్నీగా ఆన్సర్ చెప్బుతుంది. అంతేకాక డైరెక్టర్ నందిని రెడ్డి ని నీకు ఎలాంటి భర్త కావాలో చెప్పు అని గంగవ్వ అడగా దానికి సమాధానంగా నందిని నాకు ప్రభాస్ లా ఉండే భర్త కావాలి అంత హైట్ ఉండాలి. నేను లావుగా ఉన్న కాబట్టి నన్ను ఎత్తుకునే అంత లావుగ ఉండాలి ఇంకా చాల డబ్బు ఉండాలి నన్ను చూసుకోవడానికి అని ఫన్నీ గా ఆన్సర్ చెపింది. ఇలా సాగిన ఆ ఇంటర్వ్యూ చాలా ఫన్నీ ఫన్నీగా సాగిపోయింది. కాగా ఈ ఇంటర్వ్యూను రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేయడం మరో విశేషం. మొత్తానికి మూవీ ప్రమోషన్ ని బాగానే ప్రమోట్ చేసారు అంటున్నారు అభిమానులు. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.