(Local) Wed, 24 Jul, 2019

అధికార వైసీపీ కి సంబందించిన ఆడియో ని ట్వీట్ చేసిన లోకేష్

July 04, 2019,   2:08 PM IST
Share on:

మాజీ మంత్రి, టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ అధికార వైసీపీ కి సంబంధించి  ఇవాళ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. పార్టీ మారని టీడీపీ నేతలను వైసీపీ నాయకులు తీవ్రంగా వేధిస్తున్న ఓ ఆడియో వినాలని కోరారు. వైసీపీ దాడులకు ఈ ఆడియోనే సాక్ష్యమన్న లోకేష్‌.. వైసీపీ తీరు మార్చుకోవాలని సూచించారు.'సీఎం జగన్ గారూ..! పార్టీ మారను అన్న పాపానికి ఒక టీడీపీ నాయకుడిని ఎలా హింసిస్తున్నారో చూడండి. టీడీపీ నేత భార్యను ప్రస్తావిస్తూ మీ వైసీపీ నేతలు వాడిన భాష ఎంత జుగుప్సాకరంగా ఉందో విని సిగ్గుపడండి. ఇదీ మీ రాజన్న రాజ్యంలో జరుగుతున్న రాక్షస పర్వం' అని ట్వీట్ చేశారు లోకేష్‌. దయచేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ ఆడియో వినండి అని సూచించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.