(Local) Wed, 18 Sep, 2019

వచ్చే ఏడాది నుండి "వైఎస్సాఆర్ చేయూత"

August 29, 2019,   5:09 PM IST
Views: 74
Share on:
వచ్చే ఏడాది నుండి

సాంఘిక, గిరిజన, మైనార్టీ శాఖలపై సమీక్ష నిర్వహించిన ఏపి సిఎం జగన్‌  'వైఎస్సార్‌ చేయూత' పథకం కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.18,750 ఇవ్వనున్నట్లు తెలిపారు . వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో క్రమం తప్పకుడా తనిఖీలు చేయాలని సూచించారు. బడుల్లో 9 రకాల సౌకర్యాలను మూడు దశల్లో కల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి పాఠశాలలు తెరిచే సమయానికే యూనిఫారాలు, పుస్తకాలు అందాలని స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఉండాలని, ఆ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బిల్లు సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం, పాడేరులో గిరిజన వైద్య కళాశాల, కురుపాంలో ఇంజినీరింగ్‌ కళాశాల, ఏడు ఐటీడీఏల్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వర్గం
జగన్‌కు మాజీ మంత్రి బహిరంగ లేఖ
జగన్‌కు మాజీ మంత్రి బహిరంగ లేఖ
25 మందితో టిటిడి పాలక మండలి
25 మందితో టిటిడి పాలక మండలి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.