(Local) Wed, 18 Sep, 2019

కాశ్మీర్ పై అఫ్రిది - గంభీర్ ట్విట్టర్ వార్

August 29, 2019,   5:43 PM IST
Views: 52
Share on:
కాశ్మీర్ పై అఫ్రిది - గంభీర్ ట్విట్టర్ వార్

 కశ్మీరి ప్రజలకు సంఘీభావంగా పాకిస్థాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చేపట్టే నిరసన కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటానని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన ట్వీట్‌పై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. అతడికి వయసు, బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు. కొందరు మనుషులకు తాము ఏం మాట్లాడుతున్నామో అర్ధం కాదని వ్యంగ్యంగా అన్నారు. అయితే గంభీర్-అఫ్రిది మధ్య మాటల యుద్ధం జరగడం ఇదే మొదటిసారి కాదు.కశ్మీరీ ప్రజలకు సంఘీభావంగా ప్రతీ శుక్రవారం 'కశ్మీర్ అవర్' పేరిట ఓ కార్యక్రమం చేపడతామని పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. యువ‌త నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొనాల‌ని అఫ్రీదీ త‌న ట్విట్ట‌ర్‌లో కోరారు. ఈ నేపథ్యంలో గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.మిత్రులారా, సాహిద్‌ అఫ్రిది అవమానం పాలయ్యేందుకు తర్వాత ఏం చేయాలని షాహిద్‌ అఫ్రిదిని అడుగుతున్నాడు. ఎలాంటి సందేహం లేకుండా దీనివల్ల తెలిసిందేమిటంటే షాహిద్‌ అఫ్రిది పరిణతి పొందేందుకు నిరాకరించాడని! అతడికి సాయం చేసేందుకు ఆన్‌లైన్‌ కిండర్‌ గార్డెన్‌ పాఠాలు ఆర్డరిస్తున్నాను అని గౌతమ్‌ ట్వీట్‌ చేశాడు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ఫరూఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారో చెప్పండి -కేంద్రాన్న ...
ఫరూఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారో చెప్పండి -కేంద్రాన్న ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.