(Local) Mon, 17 Jun, 2019

క్షీణించిన అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం

June 10, 2019,   2:31 PM IST
Share on:

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం లండన్‌కు తరలించారు. అక్బర్‌పై దాడి జరిగిన ఎనిమిదేళ్ల అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసరంగా లండన్‌కు మెరుగైన వైద్య సేవలకోసం తరలించినట్లు తెలిసింది. రంజాన్ మాసంలో మక్కా ఉమ్రా యాత్రకు వెళ్లిన ఎంఎల్‌ఏ అక్భరుద్దీన్ ఓవైసికి అక్కడే ఆరోగ్యం క్షీణించడంతో లండన్‌కు తీసకువెళ్లినట్లు ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి తెలిపారు. అక్భర్ ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థనలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.