(Local) Mon, 23 Sep, 2019

ప్రపంచ కప్ : శ్రీలంక X పాక్

June 07, 2019,   2:11 PM IST
Views: 186
Share on:
ప్రపంచ కప్ : శ్రీలంక X  పాక్

ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్, శ్రీలంకలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చెరో రెండు మ్యాచ్‌లు ఆడిన లంక, పాకిస్థాన్‌లు ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓటమి పాలయ్యాయి. బలమైన ఇంగ్లండ్‌పై గెలిచిన పాకిస్థాన్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు సంచలన జట్టుగా పేరు తెచ్చుకున్న అఫ్గానిస్థాన్‌ను ఓడించిన లంక కూడా సమరోత్సాహంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.

లంకతో పోల్చితే పాకిస్థాన్ బలంగా కనిపిస్తోంది. అంతేగాక ఇంగ్లండ్ వంటి ఫేవరెట్ జట్టును ఓడించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఒత్తిడిని సైతం  తట్టుకుని పాక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే జోరును లంకపై కూడా కనబరిచేందుకు తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాక్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఫకర్ జమాన్, హక్, సర్ఫరాజ్, మాలిక్, హఫీజ్, అమీర్‌లతో పాకిస్థాన్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో పాక్ బౌలర్లు అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. రూట్, బట్లర్‌లు సెంచరీలు సాధించినా ఒత్తిడికి గురికాకుండా జట్టును గెలిపించారు. హఫీజ్ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇక, అఫ్గాన్‌తో జరిగిన పోరులో లంక కష్టపడి విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో పాక్‌తో జరిగే పోరులో విజయం సాధించడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.