(Local) Tue, 18 Jun, 2019

వరల్డ్ కప్ : న్యూజిలాండ్ X ఆఫ్ఘానిస్తాన్

June 08, 2019,   2:26 PM IST
Share on:

వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్ జట్టు శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ చాలా బలంగా ఉంది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఓడించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పసికూన పరిగణిస్తున్న అఫ్గాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో జరిగిన మ్యాచుల్లో అఫ్గాన్ పరాజయం చవిచూసింది. అయితే రెండు మ్యాచుల్లోనూ అఫ్గాన్ గట్టిగానే పోరాడింది. బలమైన ఆస్ట్రేలియాకు దీటుగా జవాబిచ్చింది. లంకపై కూడా బాగానే ఆడింది. ఇదే సంప్రదాయాన్ని కివీస్‌పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే స్టార్ ఆటగాడు మహ్మద్ షెజాద్ సేవలు కోల్పోవడం అఫ్గాన్‌కు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పాలి. గాయం వల్ల షెజాద్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాడు. ఈ లోటును భర్తీ చేయడం అఫ్గాన్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పవచ్చు. ఇక, బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్న బ్యాటింగ్ సమస్య అఫ్గాన్‌ను వెంటాడుతోంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.