(Local) Mon, 22 Jul, 2019

రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురిపించిన కోహ్లీ

July 03, 2019,   12:57 PM IST
Share on:

టీమిండియా,బంగ్లాదేశ్‌ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.రోహిత్‌ను కొన్నేళ్లుగా చూస్తున్నా. వన్డేల్లో ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లో అతడు బెస్ట్‌ ప్లేయర్‌. అతడి ప్రదర్శన చూసినప్పుడల్లా ఆనందంగా ఉంటుంది. రోహిత్‌ ధాటిగా ఆడినప్పుడు.. అతడి స్ట్రైక్‌ పైనే అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక బంగ్లాదేశ్‌ విషయానికొస్తే.. టోర్నమెంట్‌ మొదలైనప్పటి నుంచి వాళ్లు చాలా బాగా ఆడుతున్నారు. వారి పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఓడిపోయినప్పటికీ వారు చాలా క్రెడిట్ సంపాదించుకున్నారు. అన్ని కోహ్లీ అన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.