(Local) Mon, 22 Jul, 2019

న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ను అధిగమించేందుకు ప్రయత్నిస్తాం - సర్ఫరాజ్‌ అహ్మద్‌

July 05, 2019,   11:27 AM IST
Share on:

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఆడబోయే చివరి మ్యాచ్‌లో తాము శక్తిమేర రాణించి న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ను అధిగమించేందుకు ప్రయత్నిస్తామని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు శుక్రవారం మీడియాతో మాట్లాడిన అతడు పై విధంగా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌ చేరాలంటే బంగ్లాపై తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధించి ఆ తర్వాత 316 పరుగులు తేడాతో గెలవాలి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏదైనా అద్భుతం జరిగితే తప్స సెమీస్‌కు చేరమని ,వాస్తవంగా కష్టమైనప్పటికి గెలవడానికి మాత్రం ప్రయత్నిస్తామని చెప్పాడు. మరోవైపు బంగ్లాదేశ్‌..టీమిండియా చేతిలో ఓడిపోవడంతో ఆ జట్టు అక్కడితోనే సరిపెట్టుకుంది. ఇవాళ జరగబోయే మ్యాచ్‌లో ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప పాక్‌ సెమీస్‌కి చేరదు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.