(Local) Mon, 22 Jul, 2019

విశ్వసమరం తరువాత ధోని రిటైర్మెంట్

July 03, 2019,   11:40 PM IST
Share on:

టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ కు సిద్దమయ్యారని తెలుస్తోంది. వరల్డ్ కప్ తర్వాత అతను రిటైర్ కానున్నారని, ఇప్పటికే దీనికి సంబంధించి బీసీసీఐకి ధోని సమాచారమిచ్చారని చర్చ జరుగుతోంది. ఈ ప్రపంచ కప్ లో పేలవమైన ఆటతీరుతో ధోని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ధోనీ నుంచి భారీ ఇన్నింగ్స్ లు ఆశించిన అభిమానులు ధోనీ ఆటతీరుతో విసుగు చెంది విమర్శల వర్షం కురిపించారు. ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్, మాజీ కెప్టెన్ గంగూలీ, మంజ్రేకర్ లు ధోని స్లో బ్యాటింగ్ పై బహిరంగంగానే విమర్శలు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని ధోనీ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రెండో ప్రపంచకప్ సాధించగానే రిటైర్ తీసుకోవాలని. ఇదే సరైన సమయమని ధోని భావిస్తున్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.