(Local) Sat, 06 Jun, 2020

ప్రపంచ కప్ : సెమీస్ లో సగర్వంగా అడుగుపెట్టిన కోహ్లీ సేన

July 03, 2019,   2:00 PM IST
Share on:
ప్రపంచ కప్ : సెమీస్ లో సగర్వంగా అడుగుపెట్టిన కోహ్ల ...

కోహ్లీ సేన సెమీస్లోకి సగర్వంగా అడుగుపెట్టింది . ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి వున్నా ముందే బెర్తును ఖ్యంగా చేసుకుంది.వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.ఈ విజయంతో 8మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ సేన 13 పాయంట్లతో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. బుధవారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో సెమీఫైనల్ బెర్త్లు  దాదాపుగా ఖరారయ్యే అవకాశాలున్నాయి. తొలుత బ్యాట్ చేసిన భారత్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు తొలి వికెట్‌కు 180 పరుగులు జోడించి బలమైన పునాది వేయడంతో9 వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ(104; 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించగా, కెఎల్ రాహుల్(77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఇక రిషభ్ పంత్ (48; 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకం సాధించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. చివర్లో ఎంఎస్ ధోని (35; 33 బంతుల్లో 4 ఫోర్లు) కూడా రాణించడంతో భారత్ బంగ్లా ముందు 315 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కాగా లక్ష ఛేదనలో బంగ్లాదేశ్‌కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. 39 పరుగుల వద్ద ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ వికెట్ కోల్పోయింది. 22 పరుగుల చేసిన ఇక్బాల్ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన షకీబ్ అల్ హసన్ మరో ఓపెనర్ సౌమ్య సర్కార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే వీరిద్దరూ రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించాక 33 పరుగులు చేసిన సర్కార్ హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.తర్వాత 121 పరుగుల వద్ద ముష్ఫికర్ రహీమ్ (24) మూడో వికెట్ రూపంలో చాహల్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన లిటన్ దాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో షకీబ్ ఈ టోర్నమెంట్‌లో మరో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అయితే 162 పరుగుల వద్ద లిటన్ దాస్ కూడా హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెను దిరగడంతో బంగ్లాదేశ్ వెన్ను విరిగినట్లయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే మొసద్దెక్ హసన్ కూడా బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఒంటరి పోరు సాగించిన షకీబ్ అల్ హసన్ కూడా పాండ్య బౌలింగ్‌లో కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 74 బంతుల్లో 66 పరుగులు చేసిన షకీబ్ 6 బౌండరీలు బాదాడు. షకీబ్ ఔట్ కావడంతో బంగ్లా పోరు ముగిసిందనే అందరూ భావించారు. అయితే సబ్బీర్ రెహమాన్, సఫియుద్దీన్‌లు సమయోచిత బ్యాటింగ్ చేయడంతో పాటు వేగంగా పరుగులు చేస్తూ జట్టులో విజయంపై జట్టులో ఆశలు రేకెత్తించారు. అయితే 36 పరుగులు చేసిన సబ్బీర్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత శిబిరంతో సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

సబ్బీర్, సఫియుద్దీన్‌లు ఏడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. మరో 12 పరుగుల తర్వాత8 పరుగులు చేసిన మొర్తజా భువనేశ్ కుమార్ బౌలింగ్‌లో ధోనీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత రూబెన్, ముస్తఫిజుర్‌లను బుమ్రా వరస బంతుల్లో ఔట్ చేసి టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు.సైఫుద్దీన్ (51 నాటౌట్) చివరి వరకు పోరాటం సాగించినాఫలితం లేకపోయింది. దీంతో బంగ్లాదేశ్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 286 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా 55 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా పాండ్య 60 పరుగులకు 3 వికెట్లు సాధించాడు. షమీ, భువీ, చాహల్‌లకు తలా ఒక వికెట్ దక్కింది.

రాణించిన ఓపెనర్లు
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్, -కెఎల్ రాహుల్‌లు ఘనంగా ఆరంభించారు. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఈ క్రమంలోనే రోహిత్ సెంచరీ సాధించాడు. శతకం సాధించిన రోహిత్ ఎంతో సేపు క్రీజ్‌లో నిలవలేదు. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిటాన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా ఔటయ్యాడు. కాగా, మరో 15 పరుగుల వ్యవధిలో రాహుల్ కూడా ఔట్ కావడంతో 195 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కోహ్లి-రిషభ్ పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ జోడి 42 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి(26) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, వెంటనే హార్దిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు.

అయితే రిషభ్ పంత్ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఒక భారీ షాట్‌కు యత్నించిన రిషభ్.. వరల్డ్ కప్ లో  హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని రెండు పరుగుల వ్యవధిలో జార విడుచుకున్నాడు. దినేశ్ కార్తీక్(8) సైతం నిరాశపరచగా, ధోని క్రీజ్‌లో నిలిచి భారత్ స్కోరును మూడొందలు దాటించాడు. ముస్తాఫిజుర్ వేసిన చివరి ఓవర్ మూడో బంతికి ధోని ఔట్ కాగా, ఐదో బంతికి భువనేశ్వర్ రనౌట్ అయ్యాడు. ఇక చివరి బంతికి మహ్మద్ షమీ బౌల్డ్ కావడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ ఐదు వికెట్లతో రాణించగా, షకీబుల్ హసన్, సౌమ్య సర్కార్, రూబెల్ హుస్సేన్ తలో వికెట్ తీశారు. ఓపెనర్లు మంచి ఆరంభమే ఇచ్చినా… బంగ్లా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేశారు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) ముష్ఫికర్‌ (బి) రుబెల్‌ 77; రోహిత్‌ (సి) లిటన్‌ (బి) సర్కార్‌ 104; కోహ్లి (సి) రుబెల్‌ (బి) ముస్తాఫిజుర్‌ 26; పంత్‌ (సి) మొసాదెక్‌ (బి) షకిబ్‌ 48; హార్దిక్‌ (సి) సర్కార్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0; ధోని (సి) షకిబ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 35; కార్తీక్‌ (సి) మొసాదెక్‌ (బి) ముస్తాఫిజుర్‌ 8; భువనేశ్వర్‌ రనౌట్‌ 2; షమి (బి) ముస్తాఫిజుర్‌ 1; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 314;
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తమీమ్‌ (బి) షమి 22; సౌమ్య సర్కార్‌ (సి) కోహ్లి (బి) పాండ్య 33; షకిబ్‌ (సి) కార్తీక్‌ (బి) పాండ్య 66; ముష్ఫికర్‌ (సి) షమి (బి) చాహల్‌ 24; లిటన్‌ దాస్‌ (సి) కార్తీక్‌ (బి) పాండ్య 22; మెసాదెక్‌ (బి) బుమ్రా 3; షబ్బీర్‌ (బి) బుమ్రా 36; సైఫుద్దీన్‌ నాటౌట్‌ 51; మొర్తజా (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 8; రుబెల్‌ (బి) బుమ్రా 9; ముస్తాఫిజుర్‌ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (48 ఓవర్లలో ఆలౌట్‌) 286;

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.