(Local) Mon, 01 Jun, 2020

భారత్ లో పర్యటించనున్న అమెరికా విదేశంగా సహాయ మంత్రి

August 09, 2019,   9:20 PM IST
Share on:
భారత్ లో పర్యటించనున్న అమెరికా విదేశంగా సహాయ మంత్ర ...

అమెరికా విదేశాంగ సహాయమంత్రి జాన్ సుల్లివన్ భారత్, భూటాన్ దేశాల్లో ఈ నెల 11 నుంచి 17 వరకు పర్యటించనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలకంగా ఉన్న ఈ రెండు దేశాలతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత పర్యటన సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశం కానున్నారు. అనంతరం భారత్-అమెరికా ఫోరమ్‌లో ప్రసంగించనున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే సుల్లివన్ పర్యటన చోటు చేసుకోనుండడంతో ఆయన పర్యటనపై విశేష ఆసక్తి నెలకొంది.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.