(Local) Tue, 02 Jun, 2020

అంతర్జాతీయ సమాజం అండగా నిలిచే అవకాశం లేదు -షా మహ్మద్‌ ఖురేషీ

August 13, 2019,   12:25 PM IST
Share on:
అంతర్జాతీయ సమాజం అండగా నిలిచే అవకాశం లేదు -షా మహ్మ ...

కశ్మీర్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అలాగే అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పాక్‌ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్‌ అంశంలో భారత్‌పై పాక్‌ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐరాస భద్రతా మండలి సిద్ధంగా లేదని ఘాటుగా స్పష్టం చేశారు.

” కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. వారు(ఐరాస) మనల్ని పూలమాలతో స్వాగతం పలకడానికి సిద్ధంగా లేరు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డంపడవచ్చు. ప్రజలు వివేకంతో ఆలోచించాలి” అని ఆయన వ్యాఖ్యనించారు.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.