(Local) Wed, 24 Jul, 2019

విజయ్ మాల్యా అప్పగింత విషయం మళ్ళీ యూకే కోర్టుకు చేరింది

July 02, 2019,   2:41 PM IST
Share on:

మాల్యాను ఇండియాకు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్స్ కోర్టు తీర్పివ్వగా, యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావిద్ సైతం అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. ఇక తన అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ మాల్యా మరోమారు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం 63 సంవత్సరాల వయసున్న మాల్యా, ఇప్పటికే ఓ మారు యూకే హైకోర్టులో విఫలమైన సంగతి తెలిసిందే.నేడు మాల్యా పిటిషన్ విచారణకు రానుండగా ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్, మాల్యాను అప్పగించడమా? లేక లండన్ లోనే విచారించడమా? అన్న విషయమై వాదనలు విని, తీర్పివ్వనుంది. ఒకవేళ మాల్యాను ఇండియాకు పంపాలన్న నిర్ణయమే వస్తే, 28 రోజుల్లోగా ఇండియాకు రావాల్సిందే!

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.