(Local) Mon, 22 Jul, 2019

భారత్ వెనక్కి తగ్గాలి .... ట్రంప్ ట్వీట్

June 27, 2019,   11:47 AM IST
Share on:

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ జపాన్ ఓసాకాలో  క‌లుసుకోనున్నారు.  కానీ దానికి ముందే ట్రంప్ ఓ హెచ్చ‌రిక జారీ చేశారు.త‌మ వ‌స్తువుల‌పై భార‌త విధించిన సుంకాల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు.అమెరికా ఉత్ప‌త్తుల‌పై అధిక సుంకాన్ని విధించ‌డాన్ని ట్రంప్ త‌ప్పుప‌ట్టారు. ఇది అమోద‌యోగ్య‌మైన చ‌ర్య కాద‌న్నారు.
ఆ సుంకాల‌ను ఎత్తివేయాల‌న్నారు.జీ20 స‌మావేశంలో మోదీని క‌ల‌వ‌నున్న‌ట్లు ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.ఎన్నో ఏళ్లుగా భార‌త్ త‌మ ఉత్ప‌త్తుల‌పై అధిక సుంకాల‌ను విధిస్తున్న‌ద‌ని, ఇటీవ‌ల వాటిని మ‌రింత పెంచింద‌ని, దీన్ని స‌హించేది లేద‌ని ట్రంప్ ట్వీట్ చేశారు.ఇటీవ‌ల అమెరికా త‌మ దేశంలో భార‌తీయ ఉత్ప‌త్తుల‌పై సుంకాల‌ను పెంచింది. దానికి ప్ర‌తీకారంగా భార‌త్ కూడా అమెరికా ఉత్ప‌త్తుల‌పై సుంకాన్ని పెంచింది.సుమారు 28 ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ్ డ్యూటీని పెంచింది. దీంతో రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న‌ది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.