(Local) Mon, 01 Jun, 2020

కశ్మీర్ వివాదం పై యూ  టర్న్ తీసుకున్న ట్రంప్

August 13, 2019,   3:21 PM IST
Share on:
కశ్మీర్ వివాదం పై యూ  టర్న్ తీసుకున్న ట్రంప్

కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ విషయంపై ట్రంప్ యూటర్న్  తీసుకున్నారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించే ఎలాంటి ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టంగా చెప్పారని అమెరికాలో భారత రాయబారి హర్ష్ వర్దన్ శ్రింగ్లా తెలిపారు. ఇండియా-పాకిస్థాన్ లు చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యను పరిష్ఖరించుకోవాలని దశాబ్దాల నాటి అమెరికా పాత పాలసీ చెబుతోందని… మధ్యవర్తిత్వం వహించాలనేది ఆ పాలసీలో లేదని అన్నారు. మధ్యవర్తిత్వానికి తాము ఒప్పుకోబోమని భారత్ స్పష్టం చేయడంతో… మధ్యవర్తిత్వం వహించే ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు. లాహోర్ డిక్లరేషన్, సిమ్లా ఒప్పందం మేరకు ఇరు దేశాలు కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ చెప్పారని హర్ష్ వర్దన్ శ్రింగ్లా అన్నారు. 

సంబంధిత వర్గం
ఉద్యమకారులకు మద్దతుగా  ట్రంప్‌
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.