(Local) Mon, 17 Feb, 2020

రెండు హెలికాప్టర్లు ఢీకొని 13మంది సైనికులు మృతి

November 26, 2019,   8:29 PM IST
Share on:
రెండు హెలికాప్టర్లు ఢీకొని 13మంది సైనికులు మృతి

మాలి దేశంలోని సాహెల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు హెలికాప్టర్లు ఢీకొని 13మంది ఫ్రాన్స్ సైనికులు చనిపోయారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మంగళవారం నిర్వహించిన ఆపరేషనల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ఆరుగురు అధికారులు ఉన్నట్లు ప్రకటించారు. కొన్ని దశాబ్దాల కాలంలో ఇది అత్యంత విషాదకర మిలిటరీ ప్రమాదమని వెల్లడించారు. ఘటనకు గల కారణాలను అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇస్లామిక్ మిలిటెంట్లు మాలిలోని ఉత్తర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో 2013లో ఫ్రాన్స్ ప్రభుత్వం తన బలగాలను మోహరించింది. 4,500 ఫ్రాన్స్ బలగాలు మాలీ సైన్యానికి సహకరిస్తున్నాయి. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.