(Local) Thu, 09 Jul, 2020

పాకిస్తాన్ కి ఘాటు హెచ్చరికలు చేసిన తాలిబన్

August 09, 2019,   9:22 PM IST
Share on:
పాకిస్తాన్ కి ఘాటు హెచ్చరికలు చేసిన తాలిబన్

భారత దేశం జమ్మూ-కశ్మీరుపై తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయంతో ఓ వైపు పాకిస్థాన్ గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో తాలిబన్లు పాకిస్థాన్‌ను హెచ్చరించారు. కశ్మీరు సమస్యకు ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులకు ముడిపెట్టవద్దని స్పష్టం చేశారు. పాకిస్థాన్ పార్లమెంటులో పీఎంఎల్-ఎన్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై తాలిబన్ అధికార ప్రతినిథి జబీహుల్లా ముజాహెద్ ఘాటుగా స్పందించారు. ముజాహెద్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం కొన్ని పార్టీలు కశ్మీరు సమస్యను, ఆఫ్ఘనిస్థాన్ సమస్యతో ముడిపెట్టడం ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి దోహదపడదని ముజాహెద్ చెప్పారు. అంతే కాకుండా దానికి కారణాన్ని వివరిస్తూ ఆఫ్ఘనిస్థాన్ సమస్య ఇతర దేశాలతో సంబంధం లేనిదని, ఇతర దేశాల మధ్య పోటీకి వేదికగా ఆఫ్ఘనిస్థాన్ మారవలసిన అవసరం లేదని చెప్పారు.

సంబంధిత వర్గం
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.