(Local) Wed, 24 Jul, 2019

జీ20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణ పుతిన్ 'మగ్​'

June 29, 2019,   11:55 AM IST
Share on:

జపాన్​ వేదికగా 14వ జీ20 సదస్సు జరుగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక దేశాధ్యక్షులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఎన్నో దేశాల మధ్య ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి.వీటి మధ్య ఓ 'మగ్​' అందరిని ఆకర్షిస్తోంది. అదే అధికారిక విందులో రష్యా అధ్యక్షుడు వినియోగించిన తెలుపు రంగు మగ్​.

జీ20 సదస్సుకు పుతిన్​ తన సొంత మగ్​ తెచ్చుకున్నారు. అధికారిక విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పక్కన కూర్చున్న 66 ఏళ్ల పుతిన్​... తెలుపు రంగు మగ్​ను పట్టుకుని కనబడ్డారు.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.సొంత మగ్​ను పుతిన్​ వినియోగించడంపై కొందరు చురకలు అంటిస్తుంటే... రష్యా అధ్యక్షుడికి ఎవరిపైనా నమ్మకం లేదని మరికొందరు విమర్శిస్తున్నారు.ఈ విషయంపై ఓ రష్యా ప్రతినిధి స్పందించారు. ఆ మగ్​లోనే పుతిన్​ నిత్యం టీ తాగుతారని వెల్లడించారు.జీ20 సదస్సు శనివారంతో ముగియనుంది. ట్రంప్​, బ్రిటన్​ ప్రధాని థెరెసా మే సహా పలువురు నేతలతో పుతిన్​ శుక్రవారం చర్చలు జరిపారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.