(Local) Sun, 05 Jul, 2020

కుక్కల దాడిలో గర్భిణి మృతి...

November 20, 2019,   4:27 PM IST
Share on:
కుక్కల దాడిలో గర్భిణి మృతి...

పెంపుడు జీవి అనగానే టక్కున గుర్తుకు వచ్చేవి కుక్క,పిల్లి లాంటివి....అయితే కుక్క అనేది చాల విశ్వాసమైనది అని మనం వింటూనే ఉంటాం....కానీ కొన్ని సార్లు మనం పెంచుకునే కుక్కలే మనపై దాడి చేస్తే.....తాజాగా ఇలాంటి ఓ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే ప్యారిస్‌కు 55 మైళ్ళు దూరంలో ఉన్న విల్లర్స్ కాటెరెట్స్ పట్టణానికి సమీపంలోని ఉన్న అడవిలో 29 ఏళ్ల మహిళ మృతదేహం కొందరు కనుగొన్నారు. ఆమె మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆమె కుక్కలా దాడిలో మరణించింది అని ప్రాధమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు… వెంటనే విచారణ మొదలుపెట్టగా…ఆమె తన హౌండ్ జాతి కుక్కలతో అడవిలో నడుస్తూ ఉండగా అవి ఆమె మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి… ఆ కుక్కల ప్రవర్తన ముందే పసిగట్టిన ఆమె తన భర్తకు సమాచారం ఇవ్వగా అతను అక్కడికి వచ్చే లోపే ఆ కుక్కలు… ఆమె శరీరంలో తల, నడుం భాగాల్లో కరిచాయని… ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మరణించిందని వైద్యుల నివేదికలో వెల్లడించారు.

అసలు ఈ దాడి చేసింది ఎన్ని కుక్కలు అనే దాని మీద అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 93 కుక్కలకు రక్త పరీక్షలు నిర్వహించారు అధికారులు. వీటిల్లో 5 కుక్కలు ఆమె మీద దాడి చేసి చంపినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలో కొంత కాలంగా హౌన్డ్ జాతి కుక్కలు జింకలను వేటాడుతున్నాయని, ఆమె ఆ కుక్కలను అదుపు చేయడంతోనే దాడికి పాల్పడ్డాయని తేలింది. ఇది జింకలను వేటాడే సీజన్ అని స్థానిక పత్రికలూ పేర్కొన్నాయి. దీనిపై జంతు సంరక్షణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వెంటనే వాటి వేటను నిలిపి వెయ్యాలని, ఈ మేరకు ఆదేశాలు జరీ చెయ్యాలని వారు కోరుతున్నారు. ఫ్రెంచ్ వేట సంఘం ఒక ప్రకటనలో “ఈ మహిళ మరణంలో వేట హౌండ్ల ప్రమేయం” ఉన్నట్లు ఆధారాలు లేవని ప్రకటించడం గమనార్హం…

సంబంధిత వర్గం
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు  మరో అరుదైన గౌరవం
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
కొత్త రకం జిహాద్ మొదలుపెట్టిన ఐసిస్!
కొత్త రకం జిహాద్ మొదలుపెట్టిన ఐసిస్!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.