(Local) Mon, 17 Jun, 2019

అణ్వస్త్ర రహిత దేశంగా ఇరాన్ నిరూపించుకుంటేనే చర్చలు - పాంపియో

June 03, 2019,   11:15 AM IST
Share on:

ఇరాన్‌తో చర్చల అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో మాటమార్చారు.తొలుత ఎలాంటి ముందస్తు షరతులు లేకుండానే టెహ్రాన్​తో చర్చలను సిద్ధమని ప్రకటించిన ఆయన.. తన వ్యాఖ్యలను సవరించుకున్నారు.అణ్వస్త్ర రహిత దేశంగా ఇరాన్ నిరూపించుకుంటేనే షరతులు లేకుండా చర్చలు జరుపుతామన్నారు పాంపియో.అయితే.. ఇరు దేశాల మధ్య కొద్ది కాలంగా నెలకొన్న పరిస్థితుల్ని చూస్తే ఈ అంశం ప్రయోజనం కలిగించేదే.

అమెరికా చర్య... ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు కృషి చేస్తుందని భావిస్తున్నారు విశ్లేషకులు.ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమంపై విధించిన ఆంక్షల ఎత్తివేతకు సంబంధించి ఏం మాట్లాడలేదు పాంపియో.ఇరు దేశాల మధ్య మర్యాదపూర్వకమైన చర్చలు జరగాలని ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీ వ్యాఖ్యానించిన అనంతరం ఇలా మాట్లాడారు పాంపియో.

అమెరికా తరఫున పాంపియో చర్చల ప్రతిపాదనను ఇరాన్‌ తోసిపుచ్చింది.
ఇరాన్‌పై అమెరికా వైఖరి, చర్యల్లో మార్పు వస్తే గానీ చర్చలు జరిగే అవకాశం లేదని టెహ్రాన్​ ప్రతినిధి స్పష్టం చేశారు.కొంత కాలంగా ఇరాన్​, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా స్వచ్ఛందంగా వైదొలగిన అనంతరం ఈ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి.
ఇరాన్​పై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇరాన్​ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.