(Local) Sun, 27 Sep, 2020

టేకాప్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్ లో మంటలు

November 23, 2019,   12:11 PM IST
Share on:
టేకాప్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్ లో మంటలు

మనీలా వెళ్లేందుకు లాస్ ఏంజెల్స్ నుంచి టేకాప్ అయిన కాసేపటికే ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ చెందిన విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అత్యవసరంగా విమానాన్ని కిందకు దించడంతో అందులోని 347 మంది ప్రయాణికులతో పాటు 12మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. విమానంలోని పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి… ఇంజిన్ విఫలమైనట్లు పేర్కొన్నారని లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగినట్లు తెలిపారు. దీనిపై యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ స్పందిస్తూ ఎలాంటి నష్టం జరగక ముందే విమానం ల్యాండ్ అయ్యిందని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన 113 విమానం బోయింగ్ కో-777 రకానికి చెందినదిగా అధికారులు వెల్లడించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.