(Local) Mon, 26 Aug, 2019

లడక్ ఎయిర్ బేస్ కు యుద్ధ విమానాలను తరలించిన పాక్

August 12, 2019,   4:38 PM IST
Share on:

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్నప్పటి నుంచి కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్… ఇప్పుడు లడక్ సమీపంలోని ఎయిర్ బేస్ లకు యుద్ధ విమానాలను తరలించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల వెంబడి నిఘాను పటిష్ఠం చేసింది. పాకిస్థాన్ ఎయిర్ పోర్స్ కదలికలను ఎప్పటికప్పుడు భారత్ ఎయిర్ ఫోర్సు పరిశీలిస్తోంది. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ స్పందిస్తున్న తీరుపై ఇతర దేశాలు ఖండిస్తున్నా దాయాది దేశం పాక్ తన తీరును ఏమాత్రం మార్చుకోవట్లేదు.

సంబంధిత వార్తలు

సంబంధిత వర్గం

సట్లేజ్‌ నదిపై ప్రాజెక్టు గేట్లను ఎత్తేసిన పాక్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.