(Local) Sun, 20 Oct, 2019

భారత్ లో పర్యటించనున్న న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ

September 12, 2019,   3:35 PM IST
Share on:
భారత్ లో పర్యటించనున్న న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్‌ ...

అమెరికా న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ త్వరలో భారతదేశానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన వారం పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, గాంధీనగర్‌, ఆగ్రాలో ఆయన పర్యటించనున్నారు. శుక్రవారం భారత్‌కు బయల్దేరనున్న ఆయన తన పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, లైఫ్‌ సైన్సెస్‌, టెక్నాలజీ, ఉన్నత విద్య, హెల్త్‌కేర్‌, క్లీన్‌ ఎనర్జీ, సినిమా, మీడియా, తయారీ రంగాల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఆయన ఇరు ప్రాంతాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపుపై చర్చిస్తారు. మర్ఫీ వెంట ఆయన భార్య, న్యూజెర్సీ ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ సీయీవో టిమ్‌ సలివాన్‌, సెనేటర్‌ గోపాల్‌, రాజ్‌ ముఖర్జీ, సామ్‌ థామ్సన్‌ తదితరులు రానున్నారు.

సంబంధిత వర్గం
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.