(Local) Wed, 24 Jul, 2019

పునరావాస కేంద్రంపై వైమానిక బాంబు దాడిలో 40

July 03, 2019,   11:36 AM IST
Share on:

లిబియా ట్రిపోలి నగర శివారులోని తజౌరా అనే ప్రాంతంలోని వలసదారుల పునరావాస కేంద్రంపై మంగళవారం రాత్రి జరిగిన వైమానిక బాంబు దాడిలో 40 మంది మృత్యువాత పడ్డారు. మరో 80మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి సమయంలో కేంద్రంలో దాదాపు 120 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఈ దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారన్నది ఇంకా కచ్చితమైన సమాచారం లేదు. అయితే ట్రిపోలి తూర్పు భాగాన్ని అధీనంలోకి తీసుకొని పాలిస్తున్న లిబియన్ నేషనల్ ఆర్మీయే(ఎల్‌ఎన్‌ఏ) ఈ దాడికి పాల్పడిందని ఆ దేశ ప్రధాని ఫయాజ్ అల్ సెర్రా ఆరోపించారు. కాగా మృతుల్లో చాలా మందిని అఫ్రికా వలసదారులుగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.