(Local) Sat, 11 Jul, 2020

ట్రంప్‌ ట్వీట్లపై క్లారిటీ ఇచ్చిన నాసా

June 10, 2019,   1:19 PM IST
Share on:
ట్రంప్‌ ట్వీట్లపై క్లారిటీ ఇచ్చిన నాసా

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చంద్రుడు కూడా అంగారకునిలో భాగమేనంటూ ట్వీట్‌ చేసిన విషయం సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఈ గోల ఎంతకీ సద్దుమణగకపోవటంతో చివరికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా రంగంలోకి దిగి ట్రంప్‌ చేసిన ట్వీట్లపై క్లారిటీ ఇచ్చింది. ట్రంప్‌ చెప్పినట్లుగా చంద్రుడి సాయంతో నాసా అంగారకుడిపై మానవులను చేరవేస్తుంది. ఇప్పటికే క్యూరియాసిటీ, ఇన్‌సైట్‌లు మార్స్‌కు చేరుకున్నాయి. త్వరలో మరో మార్స్‌ హెలికాప్టర్‌ కూడా వాటికి తోడుగా అక్కడికి చేరుకుంటుంది అంటూ ట్వీట్‌ చేసింది. ఇక ఈ ట్వీట్స్‌తో సోషల్‌ మీడియా శాంతిస్తుందో లేదో చూడాలి.

 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.