(Local) Thu, 21 Nov, 2019

కెనడా ప్రధానికి ముద్దుపెట్టిన ట్రంప్ భార్య

August 27, 2019,   7:11 PM IST
Share on:
కెనడా ప్రధానికి ముద్దుపెట్టిన ట్రంప్ భార్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కెనడా ప్రధాని ట్రూడోకు ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఫోటోలను చూసి నెటిజన్స్ విపరీతమైన కామెంట్స్ పెడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఫ్రాన్స్ లో జరిగిన జీ7 సదస్సుకు పలు దేశాల అధ్యక్షులు వారి ఫ్యామిలీతో హాజరయ్యారు. ట్రంప్ తన ఫ్యామిలీని తీసుకుని సదస్సుకు వెళ్లాడు. ఆదివారం సాయంత్రం అధ్యక్షుల ఫ్యామిలీలు ఫోటోలకు ఫోజులిచ్చాయి. ఈ సమయంలో అక్కడ ఉన్న కెనడా ప్రధాని ట్రూడోను మెలానియా ట్రంప్ మర్యాదపూర్వకంగా ముద్దు పెట్టారు. అదే సమయంలో పక్కన ఉన్న ట్రంప్ తన కళ్లను కిందకు వాల్చినట్లు ఉన్న ఫోటోను రాయిటర్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో మెలానియా, ట్రూడో ఫోటోలపై నెటిజన్స్ స్పందిస్తూ ట్రంప్ నకు పెద్ద చిక్కే వచ్చి పడింది. మెలానియా రిస్క్ చేయడానికి కూడా వెనుకాడటం లేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో ట్రంప్ కూతురు ఇవాంక ట్రూడో పక్కన కూర్చున్న ఫోటోలను నెటిజన్స్ షేర్ చేస్తున్నారు.

సంబంధిత వర్గం
రెండోపర్యాయం జస్టిస్‌ట్రుడావు  ఎన్నికల్లో విజయం
రెండోపర్యాయం జస్టిస్‌ట్రుడావు ఎన్నికల్లో విజయం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.