(Local) Mon, 23 Sep, 2019

ట్రంప్‌ మాజీ వ్యాపార భాగస్వామి అరెస్ట్

August 27, 2019,   4:13 PM IST
Views: 78
Share on:
ట్రంప్‌ మాజీ వ్యాపార భాగస్వామి అరెస్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మాజీ వ్యాపార భాగస్వామి, భారత సంతతికి చెందిన హోటళ్ల యజమాని దినేష్‌ చావ్లా దొంగతనం కేసులో పట్టుబడ్డారు. అమెరికాలోని మంఫిస్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల లగేజీలను దొంగిలించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చావ్లా హోటల్స్‌కు సీఈవో అయిన చావ్లా.. గత వారాంతంలో మంఫిస్ అంతర్జాతీయ విమనాశ్రయం బ్యాగేజి నుంచి లగేజి తీసుకెళ్తూ సీసీ కెమేరాలకు చిక్కారు. సూట్‌కేస్‌లను దొంగిలించి తన కారులో పెట్టిన ఆయన… విమానం ఎక్కేందుకు తిరిగి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లారని పోలీసులు వెల్లడించారు. ఆయన కారును తనిఖీ చేసి అందులో ఓ సూట్‌కేస్‌తో పాటు ఇతర లగేజి ఉన్నట్టు గుర్తించామనీ.. నెలరోజుల క్రితం ఆయన వీటిని ఎత్తుకెళ్లినట్టు తేలిందని పేర్కొన్నారు. చావ్లా మంఫిస్‌కు తిరిగి రాగానే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
ఎన్నికల ముందే నా ఆస్తుల వివరాలు ప్రకటిస్తా - డొనాల ...
ఎన్నికల ముందే నా ఆస్తుల వివరాలు ప్రకటిస్తా - డొనాల ...
కీలక అంశాల పై మోదీ,  ట్రంప్ చర్చ
కీలక అంశాల పై మోదీ, ట్రంప్ చర్చ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.